తను అనుకొన్న సన్నివేశం సరిగ్గా చేయకపొతే నటీనటులపై చేయి చేసుకుంటారనే పేరు దర్శకుడు తేజకి వుంది. ఈ విషయాన్ని కొన్ని సందర్భంల్లో తేజ కూడా ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడీ జాబితాలో మరో దర్శకుడు చేశారు. ఆయనే సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు. కొంత విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘దోచేవారెవరురా’. గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవ చంద్ర ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.
ప్రణవ చంద్రకి నటన కొత్త. షూటింగ్ సమయంలో కొన్ని సన్నివేశాల్లో ఇబ్బంది పడ్డాడట. ఒక దశలో చిరాకుతో శివనాగేశ్వరరావు తనపై చేయి చేసుకున్నారని తెలిసింది. అయితే శివనాగేశ్వరరావు కాస్త సరదా మనిషి. కొన్నిసార్లు తమాషాకి కూడా అలా భయపెడుతున్నట్లు నటించడం, ప్రాక్టికల్ జోక్స్ వేయడం ఆయనకి అలవాటు. ప్రణవ చంద్ర విషయంలో కూడా అలానే ప్రవర్తించారని, కోపంగా చేయి చేసుకోలేదని యూనిట్ లో ఇంకొందరు చెబుతున్నారు.
శివనాగేశ్వరరావు నుంచి సినిమా వచ్చి చాలా కాలమైయింది. ‘దోచేవారెవరురా’ ఆయన మార్క్ ఎంటర్ టైనర్ అని ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే అర్ధమౌతోంది. ఈవారమే సినిమా విడుదలౌతుంది.