కొత్త బంగారు లోకం, హ్యాపీడేస్ లాంటి సినిమాలతో యూత్ లో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకొన్నాడు వరుణ్ సందేశ్. ఆ తరవాత కూడా కొన్ని మంచి సినిమాలు చేశాడు. అయితే.. వరుస ఫ్లాపులతో తన హవా తగ్గింది. దాంతో సినిమాలు వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. ఆమధ్య మైఖేల్ లో ఓ వెరైటీ పాత్ర పోషించాడు. తొలిసారి తనలోని విలన్ నిచూపించాడు. ఇక వరుణ్ ఇలాంటి పాత్రలకే పరిమితం అయిపోతాడనుకొన్న దశలో మళ్లీ హీరోగా అవతారం ఎత్తుతున్నాడు. వరుణ్ సందేశ్ హీరోగా `చిత్రం చూడర` అనే ఓ కొత్త సినిమా రూపుదిద్దుకొంటోంది. ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజే ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.
ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్ లో సాగదన్న విషయాన్ని పోస్టర్‌తోనే చెప్పేశారు దర్శక నిర్మాతలు.వరుణ్ సందేశ్ గెటప్ కూడా కొత్తగానే ఉంది. నేనింతే ఫేమ్ చాలా కాలం తరవాత ఈ సినిమాతో తెరపైకి వస్తోంది. ఈ సినిమాలో తను ఓ ఐటెమ్ సాంగ్ చేయబోతోంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తారు.