యంగ్ డైరెక్టర్ శ్రీ హర్ష కోనుగంటి యూత్ ను టార్గెట్ చేసుకుని డైరెక్ట్ చేసిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' బీసీ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద రెవిన్యూ పరంగా హిట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ యువ దర్శకుడికి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా సెన్సేషనల్ స్టార్ 'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం. అయితే మొదట శ్రీ హర్ష చెప్పిన స్టోరీ విజయ్ కి నచ్చకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి కొత్త కథను వినిపించాడని... కథ విజయ్ దేవరకొండకి బాగా నచ్చిందని తెలుస్తోంది. హర్షతో విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి అంగీకరించాడట. నిజంగా శ్రీ హర్షకి ఇది బంపర్ ఆఫరే. తన రెండో చిత్రాన్నే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోతో చెయ్యడం.. అది 30 కోట్లకి పైగా బడ్జెట్ ఉన్న సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆఖర్లో మొదలుఅవుతుందట.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక పూరి ఫైటర్ మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక గాని, విజయ్ శ్రీ హర్ష కోనుగంటితో సినిమా మొదలపెడతాడు. మరి హర్ష ఈ అవకాశాన్ని ఎంత వరకూ ఉపయోగించుకుంటాడో చూడాలి.