బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు పొందిన రాజమౌళి, RRR మూవీతో పాన్ వరల్డ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. జక్కన్న మేకింగ్ స్టైల్ తో అంతర్జాతీయ స్థాయి ఫాన్స్ ని సంపాదించు కున్నాడు. తెలుగు సినిమాకి అందని ద్రాక్షలా ఉన్న ఆస్కార్ ని కూడా మనకి పరిచయం చేసాడు. ప్రజంట్ జక్కన్న మహేష్ తో SSMB29 చేస్తున్నాడు. ఈ సినిమా శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా సినీప్రియులు SSMB29 కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైం లో రాజమౌళి అనుకోని వివాదం లో చిక్కుకున్నారు.
తాజాగా రాజమౌళి ఫ్రెండ్ యు.శ్రీనివాసరావు అనే అతను రాజమౌళిపై చాలా ఆరోపణలు చేస్తూ, వీడియో రిలీజ్ చేసారు. రాజమౌళితో తనకి 34 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, ఇప్పటివరకు రాజమౌళి పెట్టిన టార్చర్ భరించానని, ఇక నావల్ల కాదు ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి అందరికీ షాకిచ్చారు. విడియోతోపాటు ఒక లెటర్ కూడా రాసి, తన సెల్ఫీ వీడియో, లెటర్ ఆధారంగా రాజమౌళిపై సుమోటో కేసు ఫైల్ చేయాలని పోలీసుల్ని కోరారు శ్రీనివాసరావు. ఇతను పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేసారు.
శ్రీనివాసరావు సెల్ఫీ వీడియోలో 'నాది, రాజమౌళిది 34 ఏళ్ళ స్నేహం. టీనేజ్ లో మా ఇద్దరి లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది, ఆర్య 2 లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రాజమౌళి మాట పై నేను త్యాగం చేశాను. శాంతి నివాసం సీరియల్ ముందు జరిగిన ఇన్సిడెంట్ ఇదని తెలిపారు. రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక నేను ఇవన్నీ వాళ్ళతో వీళ్ళతో చెప్పేసానని భ్రమతో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. 30 ఏళ్ళ జీవితం వాడి కోసం త్యాగం చేశాను. ఓ సారి మా స్టోరీని సినిమా తీస్తానని అనడంతో నన్ను టార్చర్ చేస్తున్నాడు. రాజమౌళి ఫ్యామిలీ అంతా నాకు దూరం అయ్యారు అని వాపోయాడు. ఇది నా మరణ వాంగ్మూలం' అని కూడా హెచ్చరించాడు శ్రీనివాస్.
ఇందులో నిజ నిజాలు తెలియాల్సి ఉంది. శ్రీనివాస్ ఆరోపణలు పై జక్కన్న రియాక్షన్ ఏంటో చూడాలి. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా స్థాయి పెరుగుతున్న క్రమంలో తరచూ ఎవరో ఒకరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజమౌళి పై ఇప్పడు ఇలాంటి ఆరోపణలు రావటం కొంచెం మైనస్ అనే చెప్పాలి.
వివాదంలో స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025
జక్కన్న పై సంచలన ఆరోపణలు చేసిన ఆయన స్నేహితుడు యు.శ్రీనివాసరావు
రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటా అంటూ సెల్ఫీ వీడియో, లెటర్
రాజమౌళితో దాదాపు 34 ఏళ్ల స్నేహం ఉందన్న శ్రీనివాసరావు
యమదొంగ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా… pic.twitter.com/JMRRaJwp3c