మెగా డైరెక్టర్‌గా వినాయక్‌కి మంచి పేరుంది. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనత ఆయనది. ఆయన కెరీర్‌లో 'అఖిల్' తెరంగేట్రం మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మెగాస్టార్‌తో 'ఖైదీ నెంబర్ 150' చిత్రాన్ని తెరకెక్కించి మరోసారి మెగా డైరెక్టర్ సత్తా ఏంటో చూపించాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన 'ఇంటెలిజెంట్' మరోసారి వినాయక్‌కి నిరాశపరిచింది.
ఈ సినిమా తర్వాత వినాయక్ డైరెక్షన్ జోలికి పోలేదు. ఆశక్తికరమైన విషయమేంటంటే, వినాయక్ తాజాగా ఓ సినిమా చేస్తున్నారు. వినాయక్ సినిమా అంటే, ఆయన దర్శకత్వం వహిస్తున్నారనే అనుకుంటారు. కానీ, ఈ సినిమాకి ఆయన డైరెక్టర్ కాదు. హీరో. అవునండీ, ఇది నిజమే, వినాయక్ హీరోగా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి స్వయానా దిల్‌రాజు నిర్మాత. ఎన్. నరసింహారావు ఈ సినిమాకి దర్శకుడు. ప్రముఖ దర్శకుడు శంకర్‌కి శిష్యుడే ఈ నరసింహారావు. గతంలో 'శరభ' అనే సినిమాని తెరకెక్కించారు.
ప్రస్తుతం వినాయక్‌తో ఓ కాన్సెప్ట్ బేస్‌డ్ మూవీ రూపొందించబోతున్నాడట. గతంలో తాను తెరకెక్కించిన ఒకటీ అరా సినిమాల్లో అక్కడక్కడా గెస్ట్ రోల్స్‌లో మెరుపుతీగలా కనిపించి మాయమైపోయిన వినాయక్ ఇప్పుడు పూర్తిగా తెరపై కనిపించబోతున్నాడు. మెగా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వినాయక్ అసలు హీరోగా ఎందుకు మారాడు.? హీరోగా తన అభిమానులకు ఏం సందేశం ఇవ్వబోతున్నాడో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. మరో రెండు నెలల్లో ఈ సినిమా ప్రారంభం కానుంది.