బాలీవుడ్‌ మీడియాకి 'ఆటిట్యూడ్‌' చూపించిన రెడ్డి.!

By iQlikMovies - May 14, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

తెలుగులో 'అర్జున్‌రెడ్డి' సినిమాతో హీరో ఆటిట్యూడ్‌ అంత ఎలివేట్‌ కావడానికి కారణం తెర వెనక డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి అన్న విషయం గుర్తుంచుకోవాల్సిందే. ఇప్పుడీ ఆటిట్యూడ్‌ డైరెక్టర్‌ బాలీవుడ్‌లో ఇదే సినిమాని 'కబీర్‌సింగ్‌'గా రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 'కబీర్‌సింగ్‌' ట్రైలర్‌ విడుదల చేసి, ఆల్రెడీ బాలీవుడ్‌ ఆడియన్స్‌కి ఆటిట్యూడ్‌ అంటే ఏంటో చూపించాడీ తెలుగు డైరెక్టర్‌. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలోనూ మన తెలుగోడు సత్తా చాటాడు. తనదైన శైలిలో ఆటిట్యూడ్‌ చూపించి, తెలుగోడి పరువు నిలబెట్టాడు.

 

అసలింతకీ సందీప్‌ రెడ్డి ఏం చేశాడనే వివరాల్లోకి వెళితే, మీడియా సమావేశంలో భాగంగా, బాలీవుడ్‌ మీడియా హీరో, హీరోయిన్స్‌తో పాటు, డైరెక్టర్‌నీ కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. ఇది కామనే. అయితే, ఇక్కడ బాలీవుడ్‌ మీడియా హీరో షాహిద్‌కపూర్‌, హీరోయిన్‌ కైరా అద్వానీలపై మాత్రమే తమ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. సినిమాకి కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ అయిన డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డిని లైట్‌ తీసుకుంది. ఏదో నామమాత్రంగా ఓ ప్రశ్న సంధించినా, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే, మరో ప్రశ్న షాహిద్‌కపూర్‌కి సంధించింది. ఈ సిట్యువేషన్‌ని సందీప్‌ రెడ్డి వంగా లైట్‌ తీసుకోలేదు.

 

'క్వశ్చన్‌ అడిగారు కదా.. సమాధానం చెప్పేంతవరకూ వెయిట్‌ చేయాలి కదా..' అని మీడియాకి ఎదురు ప్రశ్న సంధించారు. దాంతో బాలీవుడ్‌ మీడియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గతంలోనూ మన తెలుగు డైరెక్టర్స్‌కి ఇలాంటి అవమానాలు జరిగాయి బాలీవుడ్‌లో. కానీ తాజాగా సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌ మీడియాకి చుక్కలు చూపించాడు. మనోడు చూపించిన ఆటిట్యూడ్‌కి ఇకపై ఇలాంటి అవమానాలు తలెత్తకుండా బాలీవుడ్‌ మీడియా విజ్ఞత పాఠిస్తుందేమో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS