బోల్డ్‌నెస్‌కి కొత్త అర్ధం చెబుతానంటోన్న 'డర్టీ హరి'.!

మరిన్ని వార్తలు

బోల్డ్‌నెస్‌ అంటే ఏంటీ.? మితిమీరిన శృంగారం. ఇంకా చెప్పాలంటే, ఓవర్‌ డోస్‌లో మూతి ముద్దులు, ఘాటు రొమాంటిక్‌ సన్నివేశాలు.. ఇదే ఈ జనరేషన్‌ బోల్డ్‌నెస్‌ అంటే. ఈ కాన్సెప్ట్‌తోనే చాలా సినిమాలు వచ్చేశాయి. అందులో లక్కు కుదిరి కొన్ని హిట్‌ అయితే, మరికొన్ని బోల్డ్‌నెస్‌ పేరుతో బొక్క బోర్లా పడ్డాయి. అయితే, ఆ బోల్డ్‌నెస్‌కి కొత్తర్ధం చెబుతానంటూ ముందుకొచ్చారు సీనియర్‌ నిర్మాత ఎమ్‌.ఎస్‌.రాజు. ప్రముఖ నిర్మాతగా ఎన్నో విజయవంతమైన సినిమాలు రూపొందించిన ఈయన ప్రస్తుతం ఫామ్‌లో లేని నిర్మాత. దర్శకునిగా రెండు సినిమాలను తెరకెక్కించిన అనుభవమున్న ఈయన ఇప్పుడు తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నారు 'డర్టీ హరి' చిత్రంతో.

 

శ్రవణ్‌ రెడ్డి అను కొత్త కుర్రాడ్ని హీరోగా పరిచయం చేస్తూ ఆయన తెరకెక్కిస్తున్న చిత్రమే ఈ 'డర్టీ హరి'. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు సినిమా పక్కా బోల్డ్‌ మూవీ అని తేల్చేశాయనుకోండి. అయితే, ఇలాంటి సినిమాకి రాజుగారు దర్శకత్వం వహించడమే అందరినీ ఆశ్చర్యపరుస్తోన్న అంశం. అయితే, మన రాజుగారు ఈ సినిమాని చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారట. సినిమాలో శృంగారం ఉంటుంది కానీ, ఆ శృంగారాన్ని చాలా కళాత్మకంగా చూపిస్తానని ఆయన చెబుతుండడం మరో విశేషం. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో కూడిన ఓ రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం రీ రికార్డింగ్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రుహానీ శర్మ, సిమ్రత్‌ కౌర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS