ఆగస్టు 22... చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అప్‌డేట్ల వర్షం కురిసింది. చిరు కొత్త సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఒకదాని తరవాత ఒకటి వరుస కట్టాయి. సరిగ్గా.. పవన్ కల్యాణ్ పుట్టిన రోజునా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని ఆశించారంతా. సెప్టెంబరు 2 పవన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. పవన్ కొత్తసినిమాల కబుర్లు బోలెడన్ని వినొచ్చని భావించారు. అయితే ఈసారి పవన్ ఫ్యాన్స్ ఆశలపై త్రివిక్రమ్ నీళ్లు చల్లినట్టు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ పుట్టిన రోజున `భీమ్లా నాయక్` నుంచి తొలి పాట వస్తుందని చిత్రబృందం చెప్పింది. దాంతో పాటుగా క్రిష్ - హరి హర వీరమల్లు నుంచి టీజర్, హరీష్ శంకర్ సినిమాకి సంబంధించిన టైటిల్ బయటకు వస్తాయని భావించారు. కానీ ఈసారి `భీమ్లా నాయక్` సింగిల్ తోనే సరిపెట్టుకోవాలట. ఎందుకంటే క్రిష్, హరీష్ శంకర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు ఇవ్వడం లేదు. దానికి కారణం త్రివిక్రమ్ నే. పవన్ పుట్టిన రోజున ఫోకస్ అంతా తన సినిమాపైనే ఉండాలని త్రివిక్రమ్ భావించాడట.
అందుకే క్రిష్, హరీష్ శంకర్‌లకు ఫోన్ చేసి `మీ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు ఇవ్వకండి` అని కోరాడట. త్రివిక్రమ్ నుంచి ఫోన్ వచ్చే సరికి... క్రిష్, హరీష్ కాదనలేకపోయారని తెలుస్తోంది. హరి హర వీరమల్లు టీజర్ వినాయక చవితికి, హరీష్ శంకర్ సినిమా టైటిల్ దసరాకి విడుదల చేసే అవకాశం ఉంది.