చిత్రసీమ ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. దాన్ని ఒడ్డున పడేయాల్సిన అవసరం చాలా ఉంది. ఏపీలో అయితే,... థియేటర్లు ఇంకా పూర్తిగా తెరచుకోలేదు. అక్కడ 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లేదు. పైగా టికెట్ రేట్లలో వచ్చిన మార్పు వల్ల... నిర్మాతలు సినిమాల్ని విడుదల చేసుకోవడానికి ధైర్యం చేయడం లేదు. ఏపీలో టికెట్ రేట్ల మార్పు, 100 శాతం ఆక్యుపెన్సీ, చిత్రసీమకు ప్యాకేజీ లాంటి విషయాల కోసం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితో చర్చించాలని.. చిత్రసీమ ఎప్పటి నుంచో అనుకుంటోంది. ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరింది.
ఈనెల 4న టాలీవుడ్ కి జగన్ అప్పాయింట్‌మెంట్ ఇచ్చారు. ఆరోజున తాడేపల్లి లో.. టాలీవుడ్ ప్రముఖులతో జగన్ సమావేశం అవుతారు. ఈ సమావేశానికి చిరుతో పాటు చిత్రసీమకు చెందిన ప్రముఖులు హాజరు అవుతారు. ఈ భేటీతో టాలీవుడ్ సమస్యలకు ఓ పరిష్కార మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు. వకీల్ సాబ్ సమయంలో.. టికెట్ రేట్లని అనూహ్యంగా తగ్గిస్తూ... జగన్ ప్రభుత్వం ఓ జీవో విడుదల చేసింది. ఆ జీవోని వెనక్కి తీసుకుంటే - టాలీవుడ్ తెరపిన పడినట్టే. అలాగే 100 శాతం ఆక్యుపెన్సీకీ, సెకండ్ షోలకూ అనుమతి వచ్చేస్తే.. పెద్ద సినిమాల గుబులు తీరిపోతుంది.