సంక్రాంతి సీజన్ అయిపోయింది. పండగ హడావుడి ముగిశాక తీరిగ్గా బాక్సాఫీసు ముందుకు వచ్చాడు రవితేజ. ఈసారి డిస్కోరాజా అవతారం ఎత్తాడు. విఐ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్, నభా నటేషా కథానాయికలుగా నటించారు. ఓ కమర్షియల్ పాయింట్‌కి, సైన్స్ ఫిక్షన్ జోడించి తీయడంతో - ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి టాక్ అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే.. తొలిరోజు మాత్రం బాక్సాఫీసు దగ్గర తన ప్రభావం చూపించగలిగింది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ 2.5 కోట్ల షేర్ తెచ్చుకుంది.
ఒక్క నైజాంలోనే 1.05 కోట్లు వసూలు చేసింది. సీడెడ్‌లో 35 లక్షలు వచ్చాయి. ఉత్తరాంధ్రలో 30 లక్షలు, గుంటూరులో 20 లక్షలు రాబట్టింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణాలో వసూళ్లు మందకొడిగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా అల వైకుంఠపురములో ప్రభావం కనిపిస్తూనే ఉంది. శని, ఆదివారాల లెక్కల్ని బట్టి డిస్కోరాజా ఫలితంపై ఓ అంచనాకు రావొచ్చు.