డిస్కోరాజా' ఆగిపోలేదు: చిత్ర‌బృందం క్లారిటీ

By iQlikMovies - May 06, 2019 - 13:30 PM IST

మరిన్ని వార్తలు

ర‌వితేజ క‌థానాయ‌కుడిగా 'డిస్కోరాజా' రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో న‌భా న‌టేషా, పాయ‌ల్ రాజ్‌పుత్ క‌థానాయిక‌లు. కొన్ని స‌న్నివేశాలు తెర‌కెక్కించిన త‌ర‌వాత ఈ సినిమా షూటింగ్‌ని అర్థాంత‌రంగా ఆపేశారు. బ‌డ్జెట్ స‌మ‌స్య‌ల వ‌ల్లే ఈ సినిమా ఆగిపోయింద‌న్న‌వార్త‌లొచ్చాయి. వీటిపై చిత్ర‌బృందం ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది.

 

ఈ సినిమా షూటింగ్ ఆగిపోలేద‌ని, ఈనెల 27 నుంచి హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ తెర‌కెక్కించాడినికి ప్లాన్ చేస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయ‌ని, ఆ స‌న్నివేశాలన్నీ ప‌క్కా ప్లానింగ్‌తో రూపొందించాల‌ని అనుకున్నామ‌ని, అందుకే ఆల‌స్య‌మైంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. `డిస్కో రాజా` రెండో షెడ్యూల్ సుదీర్ఘంగా సాగ‌బోతోంది. మే 27 నుంచి జూన్ 21 వ‌ర‌కూ హైద‌రాబాద్‌, ప‌రిస‌ర ప్రాంతాల్లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతారు. ఈ షెడ్యూల్ లో ప్ర‌ధాన తారాగ‌ణం మొత్తం పాల్గొంటోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS