టీజర్ టాక్ ను బట్టే 'డిస్కో రాజా' రేంజ్!

మరిన్ని వార్తలు

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కో రాజా' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై రవితేజ బోలెడు ఆశలు పెట్టుకున్నారు. అయన అభిమానులు సైతం ఈ చిత్రం ద్వారా తమ హీరో పూర్వపు ఫామ్ లోకి వస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర టీమ్ ఈ సినిమా టీజర్ ను సిద్దం చేశారు. డిసెంబర్ 6వ తేదీన ఈ టీజర్ ను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

 

ఇక ఈ సినిమా నుండి వస్తున్న ఫస్ట్ ఔట్ పుట్ కావడంతో.. ఈ టీజర్ అన్ని విధాలా ఆకట్టుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ టీజర్ కి వచ్చే ఆదరణను బట్టే.. బాక్సాఫీస్ వద్ద 'డిస్కో రాజా' భవిష్యత్తు ఆధారపడిఉంది. ఇక ఈ సినిమాని మొదట డిసెంబర్ 20న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఆ తరువాత తమ సినిమా 2020 జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుందని 'డిస్కో రాజా' రిలీజ్ డేట్ ను మార్చేసింది టీం.

 

ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అని తెలుస్తోంది. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ , తాన్యాహోప్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే రవితేజ డ్యూయల్ రోల్‌లో నటిస్తుండగా బాబీ సింహ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు. థమన్ మ్యూజిక్, ఆబ్బూరి రవి డైలాగ్స్, కార్తీక్ ఘట్టమనేని గ్రాండియర్ విజువల్స్, సినిమాకు బాగా ప్లస్ అవుతున్నాయని చిత్రబృందం చెబుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS