కాలం ఎంత వేగంగా మారుతుందో.. మన స్మార్ట్‌ఫోన్ల వాడకం కూడా అంతకన్నా వేగంగా పెరుగుతోంది. నేటి యువతరం ఎక్కువుగా డిజిటల్ స్ట్రీమింగ్ వైపే వెళ్తున్నారు. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా డిజిటిల్ వైపు చూస్తుంది. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ లను ఎక్కువుగా నిర్మిస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు దృష్టి పెడుతున్నారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే వెబ్ సిరీస్ కథలను కూడా వింటూ, నచ్చితే వెంటనే సైన్ చేసేస్తున్నారు.
ఇప్పటికే కాజల్ అగర్వాల్ వెబ్ సిరీస్ చేస్తుండగా ఈ మధ్యే సమంత అక్కినేని కూడా 'ది ఫ్యామిలీ మాన్' రెండవ సీజన్ లో నటిస్తోంది. కాగా ఇప్పుడు వీరి బాటలోనే పాయల్ రాజ్ ఫుత్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తున్నారు. పాయల్ ఓ హిందీ వెబ్ సిరీస్ లో నటించనుంది.
ఇక తమన్నా తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా ఆకర్షితురాలైంది. ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే కథగా ఉంటుందట. ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ కథల్లో నటిస్తే పాత్రలో ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని తమన్నా ఆ వెబ్ సిరీస్ లో నటించబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి మన స్టార్ హీరోయిన్లు డిజిటల్ ప్లాట్ ఫామ్ వైపు చూస్తున్నారు. అయితే సౌత్ ఇండియాలో, తెలుగులో వచ్చిన సిరీస్లు అంతగా ఆదరణకు నోచుకోలేదు. అయినా సౌతిండియాలో తమ నెట్‌వర్క్‌ను పెంపొందించుకోవడానికి సదరు డిజిటల్ స్ట్రీమింగ్ యాప్స్ కసరత్తు చేస్తున్నాయి.