'రంగమ్మత్త' బా..గా.. మారిపోయింది

మరిన్ని వార్తలు

'రంగస్థలం' సినిమాలో హీరో చిట్టిబాబు, హీరోయిన్‌ రామలక్ష్మి పాత్రలతో పాటు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవల్సిన పాత్ర 'రంగమ్మత్త' పాత్ర. ఈ పాత్ర కోసం ఏరి కోరి డైరెక్టర్‌ సుకుమార్‌ అనసూయను ఎంచుకున్నాడు. ఆ పాత్రలో అనసూయని చూసిన అభిమానులు తొలుత షాక్‌ అయినా, ఆ పాత్రలో అనసూయని తప్ప మరొకర్ని ఊహించుకోవడం కష్టమన్నంతగా తన నటనతో, అప్పియరెన్స్‌తో అనసూయ ఆకట్టుకుంది. 

సినిమా విడుదలై ఇంత కాలం గడుస్తున్నా, అభిమానుల్ని 'రంగమ్మత్త' పాత్ర వెంటాడేస్తూనే ఉంది. ఫ్యాన్స్‌నే కాదు, అనసూయని కూడా ఆ పాత్ర అంతగా వెంటాడేస్తోందట. ఆ సినిమా తర్వాత అలాంటి మరిన్ని పాత్రల్లో నటించాలని ఉందని అనసూయ చెబుతోంది. అయితే ఎప్పుడూ అలాంటి పాత్రల్లోనే కనిపిస్తే ఏముంటుంది కిక్కు అని నెటిజన్లు ఆమెకు ఉచిత సలహాలు ఇస్తున్నారట. అంటే అనసూయ నుండి ఫ్యాన్స్‌ ఇంకా ఏదో ఆశిస్తున్నారనిపిస్తోంది. 

అనసూయ అంటే గ్లామర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌. గ్లామర్‌ పాత్రల్లో అనసూయ కనిపించకపోతే, పాపం నెటిజన్లు బెంగెట్టేస్కోరూ. అందుకే అప్పుడప్పుడూ గ్లామర్‌ పాత్రల్లో కూడా కనిపించి మెప్పించమని అడుగుతున్నారు. ఆంటీ అయినా ఆ స్థాయిలో అనసూయ క్రేజ్‌ సంపాదించుకోవడమంటే విశేషమే మరి. 

ప్రస్తుతం మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, వెంకటేష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్‌ చిత్రంలో అనసూయ నటిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఒకవేళ ఈ సినిమాలో అనసూయ నటిస్తుంటే, అది ఏ తరహా పాత్రో ప్రస్తుతానికి సస్పెన్సే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS