మళ్లీ గ్లామర్‌ కంచె తెంచేసిన రకుల్‌

By iQlikMovies - June 02, 2018 - 22:33 PM IST

మరిన్ని వార్తలు

ఈ మధ్య రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హాట్‌ హాట్‌ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతోంది. కుర్రకారుకు కాక పుట్టించేస్తోంది తన హాట్‌ గ్లామర్‌తో. మొన్నామధ్య ఓ మేగ్జైన్‌ కోసం విచ్చల విడిగా పెచ్చిపోయి మరీ అందాలారేసి, ఫోటోలకు పోజిచ్చేసిన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ వివాదాలకు కేంద్రబిందువైన సంగతి తెలిసిందే. అయితే అందం ఉన్నది ఆరబోసేందుకే. ఎంటర్‌టైన్‌ చేసందుకే అన్న సూత్రాన్ని బాగా ఫాలో అయ్యే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ వివాదాల్ని, విమర్శల్ని చాలా లైట్‌ తీసుకుంది.

యథాలాపంగా మళ్లీ అలాంటి ఫోటో షూట్‌ ఒకటి రీసెంట్‌గా చేయించుకుని ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఫిలింఫేర్‌ కోసం రకుల్‌ చేయించుకున్న ఈ ఫోటో షూట్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. బికినీ కా బాప్‌ అన్న రేంజ్‌లో టూ పీస్‌ కాస్ట్యూమ్‌తో రకుల్‌ రెచ్చి పోయి అందాలారబోసేసింది. ఓన్లీ ఫోటోలే కాదు, ఈ సారి తన హాట్‌ పోజుల వీడియో క్లిప్పింగ్స్‌ కూడా పోస్ట్‌ చేసి, కుర్రోళ్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఈ వీడియోల్లో రకుల్‌ హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అన్న రేంజ్‌లో ఉంది.అయినా రకుల్‌ ప్రీత్‌సింగ్‌ని తొలి సినిమా నుండీ కౌంట్‌ చేస్తే ఎక్కడా ఎక్స్‌పోజింగ్‌లో అభ్యంతరాలు పెట్టినట్లు లేదు. తొలి సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' మొదలుకొని, గోపీచంద్‌తో నటించిన 'లౌక్యం' సినిమాలోనూ పిచ్చెక్కించే బికినీతో రెచ్చిపోయింది.

చరణ్‌తో నటించిన 'బ్రూస్‌లీ', 'ధృవ'లో ఏమంత తక్కువ చేసిందనీ, ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. ఇక ఇప్పుడసలే బాలీవుడ్‌నీ చక్కబెట్టి వచ్చేసిన రకుల్‌కీ మాత్రం ఎక్స్‌పోజింగ్‌ లెక్కల్లోనిది కాదనే చెప్పాలి. ఇదే జోరులో ఇంకా ఎన్ని లోతులు, ఎన్నెన్ని ఎత్తులు చూపిస్తుందో రకుల్‌ ముందు ముందు చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS