భారీ అంచనాల నడుమ విడుదలైనా ఏదో మూల చిన్న అనుమానం ఉంది 'అరవింద సమేత'పై. అయితే విడుదలయ్యాక రిజల్ట్ వచ్చాక ఆ అనుమానాలు పటాపంచలైపోయాయి. అయితే 100 కోట్ల క్లబ్‌లోకి చేరుతుందా? లేదా? అనే విషయమై కొన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో అయితే 55 కోట్ల షేర్ రాబట్టేసింది. ఓవర్సీస్‌లోనూ వసూళ్ళు బాగానే వున్నాయి. సెలవుల సీజన్ కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో 'అరవింద సమేత' థియేటర్ల వద్ద సందడి వాతావరణం కన్పిస్తోంది. ఈ జోరు ఈ వారమంతా కొనసాగడం ఖాయమే. ఇంకా చెప్పాలంటే రేపట్నుంచి ఈ సందడి ఇంకా బాగా పెరుగుతుంది. సందడి ఎంతలా ఉన్నా, ఎందుకో 100 కోట్ల క్లబ్‌లోకి చేరడంపై అనుమానాలైతే కొనసాగుతున్నాయి. అద్భుతం జరిగితే తప్ప 100 కోట్ల క్లబ్‌లోకి చేరబోదనీ 90 నుంచి 100 కోట్ల మధ్యలో ఆగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలు తల్లకిందులై 100 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా చేరుతుందని అభిమానులు అంటున్నారు.
అసలెందుకీ అనుమానాలంటే, నిన్న చాలా చోట్ల వసూళ్ళు కాస్త డ్రాప్ అయ్యాయి. అయితే ఈ రోజు మాత్రం వసూళ్ళు పుంజుకున్నట్లు ఉదయం నుంచి అందుతున్న రిపోర్ట్స్ చెబుతున్నాయి.
చూడాలి మరి 'అరవింద'పై తలెత్తుతున్న ఈ అనుమానాలకు చెక్ పడుతుందా? లేదా తెలియాలంటే ఈ దసరా హాలీడేస్ అయ్యేంతవరకూ ఆగాల్సిందే మరి.