శ్రీరెడ్డి ఎపిసోడ్ తర్వాత కాస్టింగ్ కౌచ్ బాధితులు చాలా మంది వెలుగులోకి వస్తున్నారు. వీరికి మహిళా సంఘాలు అండగా నిలవడంతో బాధితులు చాలా మంది మీడియా ముందుకొచ్చి, అందుకు కారణమైన వ్యక్తుల్ని ఏకరువు పెడుతున్నారు.
సినీ పరిశ్రమలో పలానా వ్యక్తి, పలానా విధంగా తమని వేధించారంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. వారి మాటల్ని బట్టి చూస్తే, మొత్తం తెలుగు సినీ పరిశ్రమ అంతా ఇదే బురదతో నిండిపోయిందా అనే అనుమానం రాక మానదు. అయితే ఈ పరిస్థితులపై తమ ఆవేదనని కొందరు ప్రముఖులు తమ సన్నిహితుల వద్ద వెల్లగక్కడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు.
ఎందుకంటే ఇది సున్నితమైన అంశం. సినీ పరిశ్రమలో కొందరు కామపిశాచుల్లా మారడం వల్లే ఈ దుస్థితి. ఆ ప్రభావం మొత్తం సినీ రంగంపై పడి, ఇండస్ట్రీ పరువు తీస్తోంది. దాంతో సినీ రంగంపై మమకారంతో వచ్చిన పలువురు ఈ సమస్యతో బాధితులుగా మారి ఇదిగో ఇన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు. కానీ శ్రీరెడ్డి ఎపిసోడ్‌తో మూల మూల దాగున్న ఎందరో బాధితులు బయటికి సవ్తున్నారు.
అయితే సినీరంగంలో అందరూ అలాంటోళ్లు కాదు. కానీ జరుగుతున్న పరిణామాలు అందర్నీ నిందితులుగా మార్చేస్తున్నాయి. కొంతమంది పబ్లిసిటీ కోసం అర్ధం పర్దం లేని ఆరోపణలు చేస్తున్నారు. వారికి మీడియాలో ఎక్కువ స్కోప్ దొరుకుతోంది. అలాంటి వారిని మీడియా ఎంకరేజ్ చేస్తున్న తీరు జుగుప్సాకరం.