దాదాపు పదేళ్ల ఇతం మాట అది. మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. శిరీష్ భరద్వాజ్ అనే యువకుడ్ని ప్రేమ వివాహం చేసుకుంది శ్రీజ. దాని వెనుక రాజకీయం ఆ తర్వాత బయటపడింది.
శ్రీజ, భరద్వాజ్ నుంచి విడిపోయి, తన తండ్రి వద్దకు చేరిపోయింది. ఆనాటి ఆ విషయాలకు సంబంధించి, సంధ్య అనే ఓ సోషల్ వర్కర్ చిరు తనతో మాట్లాడిన విషయాలని ఇప్పుడు బయట పెట్టింది. అసందర్భ ప్రేలాపన అంటే ఇదే. ఓ మహిళ అయ్యుండి, సాటి మహిళ అని కూడా చూడకుండా, జీవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది ఇటీవల సంధ్య. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి చిరంజీవి కుటుంబం మీద పడి ఏడుస్తోంది.
తన కూతురు శిరీష్ నుండి దూరమవ్వాలనుకుంటోందనీ, అయితే శ్రీజ, శిరీష్‌లకు జన్మించిన చిన్నారి విషయంలో శిరీష్ తరపున ఏమైనా అభ్యంతరాలుంటాయా అని చిరంజీవి, సంధ్యను అడిగారట. ఇదీ ఆమె చెప్పిన విషయం. చిరంజీవి అంటే, తెలుగు సినిమాకి మెగాస్టార్. బోలెడంత నెట్‌వర్క్ ఉంటుంది. న్యాయపరమైన సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉంటారు. అవన్నీ కాదని సంధ్యని చిరంజీవి బతిమలాడుకోవడమేంటి?
జీవిత మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన సంధ్య తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి సమస్యను పక్కదారి పట్టించడం కోసం ఇంతలా విలువల్ని దిగజార్చేస్తూ, పైగా మహిళల కోసం పారాడే వ్యక్తినని చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇది పూర్తిగా మెగా కడుపు మంట. శ్రీరెడ్డికి సంధ్య మద్దతివ్వడం వెనుక కూడా మెగా కడుపు మంటే కీలక పాత్ర పోషించి వుండాలి.