నటి శ్రీ రెడ్డి అసలు పవన్ కళ్యాణ్ ని ఎందుకు తిట్టింది అన్న ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు ఒక రికార్డెడ్ ఫోన్ కాల్ అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది.
ఈ తరుణంలో ఆ ఫోన్ కాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీ రెడ్డి ని దర్శకుడు ఆర్జీవీ కొంత డబ్బు తీసుకుని ఈ విషయాన్నీ వదిలేయమనడం దానికి ఆమె ఒప్పుకోకపోవడంతో చివరికి ఆమెకి పవన్ కళ్యాణ్ ని తిట్టమని సలహా ఇవ్వడం దానిని అమలు చేయడం వంటి సంబాషణలు ఇందులో ఉన్నాయి.
అలాగే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా ప్రముఖ రాజకీయ పార్టీ ఒక కుట్ర పన్ని అందులో శ్రీ రెడ్డిని భాగస్వామ్యం చేయాలనీ కూడా చూసినట్టు అదే విధంగా శ్రీ రెడ్డి కూడా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించేందుకు కృషి చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది సదరు ఫోన్ సంబాషణలో..
మొత్తానికి ఈ చిన్న వివాదం కాస్త చిలికి చిలికి ఒక పెద్ద గాలివానలా మారి చివరికి ఒక పెద్ద న్యుసేన్స్ లా మారిపోయింది. ఇది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.