మెగా ఫ్యామిలీకి టాలీవుడ్ కి మధ్య విబేధాలు..!

మరిన్ని వార్తలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశ్యించి చేసిన అసభ్యకర పదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఒక చిన్న సైజు పోరాటాన్ని మొదలుపెట్టాడు అనే చెప్పాలి. ఇక తొలిరోజు దీనికి సంబంధించి ఫిలిం చాంబర్ కి మెగా ఫ్యామిలీ మొత్తం వెళ్ళడం నిరసన తెలపడం వంటివి కూడా చేశారు.
ఈ తరుణంలో ఇండస్ట్రీలోని అన్ని శాఖలకి సంబంధించి కొన్ని మీటింగ్స్ నిర్వహించారు. 

ఆ సందర్భంగా ఈ మీటింగ్స్ కి సంబంధించి ఒక సంచలన విషయం అంటూ ఒక ప్రముఖ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రికా కథనం ప్రకారం-  మెగా నిర్మాత అల్లు అరవింద్ అందరి ముందు ఒక ప్రపోజల్  పెట్టారట. ఆ ప్రోపోజల్ ప్రకారం, ఎవ్వరు కూడా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్న మూడు మీడియా చానల్స్ ని బహిష్కరించాలి (అంటే వెళ్ళకూడదు) అని చెప్పారట!

అయితే వెంటనే ఆ ప్రపోజల్ కి మిగతా అందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ అంశం మెగా ఫ్యామిలీకి సంబందించింది అని దానికి అందరికి లింక్ పెట్టడం సమంజసం కాదు అని వారు వివరణ ఇచ్చారట. అలాగే కొన్నిరోజుల క్రితం చిత్రపరిశ్రమలో ఉన్న ఆడవారి పైన ఒక ఛానల్ కి చెందిన న్యూస్ యాంకర్ ఒక అభ్యంతరకర పదం వాడిన సందర్భంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మెగా ఫ్యామిలీ ఎందుకు పాల్గొనలేదు అని ప్రశ్నించారట.

తాము ఆ ప్రెస్ మీట్ గురించి మెగా ఫ్యామిలీ కి సమాచారం ఇచ్చినప్పటికీ వారు ఎవరు రాలేదు. అప్పుడు గనుక మెగా ఫ్యామిలీ నుండి ఏదైనా స్పందన కాని ప్రత్యక్షంగా వచ్చి మద్దతు తెలిపి ఉంటే తాము కూడా ఇప్పుడు ఈ ప్రపోజల్ ని ఆలోచించేవాళ్ళము అని చెప్పారట.
అయితే దీని పైన ఇటు మెగా ఫ్యామిలీ కాని అటు ఇండస్ట్రీ ప్రముఖులు కాని ఇంకా స్పందించలేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS