ఈ మధ్య వచ్చిన హీరోయిన్స్‌లో సాయి పల్లవి మీద వచ్చినన్ని గాసిప్స్ మరో హీరోయిన్ మీద రాలేదనే చెప్పాలి. ఆమె నటించింది మూడు సినిమాలే అయినా కానీ, రూమర్స్ మాత్రం ఎక్కువే తన ఖాతాలో వేసుకుంది.
తొలి సినిమా టైంలో ఏదో అలా జరిగిపోయింది కానీ, రెండో సినిమా 'ఎంసీఏ' టైంలో నానితో తనకు తగాదాలు అంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఆ విషయాన్ని ఇటు హీరో నాని, సాయి పల్లవి కూడా ఖండించారు. అయినా కానీ ఆ రూమర్స్‌కి చాలా రోజులు అడ్డు కట్ట పడలేదు. ఇప్పుడు మరో యంగ్ హీరో నాగశౌర్యతో మాత్రం సాయి పల్లవికి పెద్ద చిక్కే వచ్చేసింది. ఈ ఇద్దరూ కలిసి 'కణం' సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే ఈ ఇద్దరికీ మధ్య వివాదాలు అంటూ ప్రచారం జరిగింది. ఆ వివాదాల వల్లే నాగశౌర్య సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొనడం లేదనే టాక్ కూడా ఉంది.
అయితే సాయి పల్లవి మాత్రం నాగశౌర్య చాలా మంచోడు. ఎలాంటి పాత్రలోనైనా ఈజీగా పరకాయ ప్రవేశం చేస్తాడు. అంతేకాదు, రియల్‌గా కూడా తన ఆటిట్యూడ్ ఎంతో బాగుంటుంది అంటూ నాగశౌర్యను తెగ పొగిడేస్తోంది. కానీ నాగశౌర్య మాత్రం సాయి పల్లవి గురించి అలాంటివేమీ చెప్పడం లేదు.
అసలింతకీ వీరిద్దరి మధ్యా వివాదానికి దారి తీసిన అంశాలేమిటో కానీ, పాపం సాయి పల్లవి ఈ విషయంలో చాలా బాధపడుతోందట. నాగశౌర్య విషయంలో తను చేసిన తప్పు ఏంటో తెలిస్తే, సారీ చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెబుతోంది. మరి నాగశౌర్య మౌనం వీడాలిక. వీరిద్దరూ జంటగా తెరకెక్కిన మూవీ 'కణం' ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.