బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈ మధ్య హాలీవుడ్‌లో బిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. అక్కడ ఓ సినిమాలో నటించింది ప్రియాంకా చోప్రా. అయితే ఆ సినిమా ఆశించిన రిజల్ట్‌ని అందించలేదు. కానీ ప్రియాంకా హాలీవుడ్‌కి వెళ్లాకా, ఎక్స్‌పోజింగ్ డోస్ బాగా పెంచేసింది అనే కామెంట్స్ మాత్రం తెచ్చుకుంది. ఇదిలా ఉండగా, అక్కడే 'క్వాంటికో' అనే టీవీ సిరీస్‌లోనూ నటించింది దీపికా పదుకొనె. ఈ సిరీస్‌లో కూడా ప్రియాంకా హాట్ హాట్ అందాల దాడికి అభిమానులు షరా మామూలుగానే కామెంట్స్ గుప్పించారు.
అయితే ఇంతవరకూ సాఫీగానే సాగిన ఈ 'క్వాంటికో' కొత్త సీజన్ సడెన్‌గా ఆగిపోయింది. కారణమేమిటో తెలియదు కానీ, ఈ సిరీస్‌పై చాలా ఆశలు పెట్టుకుంది ప్రియాంకా చోప్రా. ఇలా జరిగేసరికి పాపం చాలా డిజప్పాయింట్ అయిపోయింది ప్రియాంకా చోప్రా. దీంతో ప్రియాంకా హాలీవుడ్ కలలు అటకెక్కేసినట్లేననిపిస్తోంది. గోడకి కొట్టిన బంతిలా వెనక్కి తిరిగొచ్చేసింది ప్రియాంకా. దాంతో బుద్దిగా ఇండియాకి వచ్చేసి బాలీవుడ్‌లో ఇదివరకటిలాగే సినిమాలు చేసుకోవాలనుకుటోందట. ఈ క్రమంలోనే నిర్మాతగా ఓ సినిమాను ప్లాన్ చేస్తోందట.
అయితే ఆ సినిమా హిందీలో కాదు, మరాఠీలో. 'వాటర్ ప్రాబ్లెమ్' అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమాని ప్రియాంకా నిర్మించబోతోందట. నిర్మాతలుగా మారడం ముద్దుగుమ్మలకు కొత్తేమీ కాదు. ఆల్రెడీ బాలీవుడ్‌లో అనుష్కా శర్మ ఓ వైపు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, అప్పుడప్పుడూ అభిరుచి గల సినిమాలను నిర్మిస్తూ ముందుకెళ్తోంది. అలాగే ఇకపై ప్రియాంకా కూడా చేయనుందన్న మాట.