కర్ణాటక ఎన్నికల్లో మరోసారి సాయి కుమార్‌కి పరాజయం ఎదురైంది. చాలా కష్టపడ్డాడు కానీ ఫలితం దక్కలేదు. ఈ కారణంగా సాయికుమార్ ఆర్ధికంగా చాలా నష్టపోయారనీ తెలుస్తోంది. కర్ణాటకలో చాలా మంది తెలుగు వారున్నారు. వారందరికీ సాయి కుమార్ అంటే అభిమానం ఉంది. కానీ బీజేపీ నాయకులెవరూ సాయి కుమార్ తరపున ప్రచారం చేయలేదనీ, దాంతో ఒంటరిగా మిగిలారనీ, ఆయన ఓటమి చవి చూడడానికి ఇదో కారణమనీ అంటున్నారు.
అంతేకాదు, రాజకీయాల కారణంగా సాయికుమార్ బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలను విమర్శించారు. టీడీపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినా, తట్టుకుని తాను విజయం సాధిస్తాననీ, అంతదాకా వస్తే చిరంజీవిని కూడా ఢీకొట్టగలననే ఓవర్ కాన్ఫిడెన్స్ సాయి కుమార్‌ని దెబ్బ తీసి ఉండొచ్చుననీ కొందరు భావిస్తున్నారు. నో కామెంట్ అని సరిపెట్టుకుంటే సరిపోయేది. కానీ ఆయా హీరోలను ఈ సందర్భంగా విమర్శించడం ద్వారా వారి వారి అభిమానులు సాయి కుమార్‌కి యాంటీ అయ్యి ఉండొచ్చు.
దాంతో ఆయనకు మద్దతుగా నిలవకపోయి ఉండొచ్చు. ఇన్ని కారణాలతో సాయి కుమార్ కర్ణాటక ఎలక్షన్స్‌లో ఓటమి పాలయ్యారు. సాయికుమార్ పోటీ చేసిన నియోజకవర్గాల్లో గతంలోనూ ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి ఎలాగైనా గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. కానీ ఆయన నమ్మకం ఈ సారి కూడా వమ్మైంది. పరాజయమే మిగిలింది.