భళ్లాలదేవా.! అసలేమైంది?

మరిన్ని వార్తలు

భళ్లాలదేవ రానాకు ఆరోగ్యం బాగాలేదనీ, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడంటూ వదంతులు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈ గాసిప్‌ ఫాస్ట్‌గా ట్రోల్‌ అవుతోంది. అసలింతకీ భళ్లాలదేవకు ఏమైనట్లు? ఈ గాసిప్స్‌లో నిజమెంత? అంటే అసలేమాత్రం నిజం లేదనీ రానా సన్నిహుతుల నుండి అందిన సమాచారమ్‌. 

రానాకి చిన్నప్పటి నుండీ కంటికి సంబంధించిన సమస్య ఉన్న మాట వాస్తవమే. అందుకు తగిన ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటున్నాడు రానా. మొన్నీమధ్యనే ఆ కంటికి సంబంధించి కొన్ని కాస్ట్‌లీ మెడిసన్స్‌ని విదేశాల నుండి తెప్పించాడు రానా. అప్పుడు కూడా కొన్ని గాసిప్స్‌ స్ప్రెడ్‌ అయ్యాయి. ఇప్పుడు ఆ కంటికి ఆపరేషన్‌ నిమిత్తం రానా రెడీ అవుతున్నాడట. అందుకోసం వైద్యుని సలహా మేరకు ఒక రకమైన డైట్‌ ఫాలో చేస్తున్నాడట. త్వరలో కంటి ఆపరేషన్‌ చేయించుకోనున్నాడు రానా. అంతే తప్ప ఇంకే ఇతర అనారోగ్య సమస్యలు రానాకి లేవనీ ఆయన అత్యంత సన్నిహితుల ద్వారా అందిన సమాచారమ్‌. 

ఒకవేళ అంతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులే ఉంటే, 'బాహుబలి' టైంలో కండలు తిరిగే బాడీ కోసం రానా కఠోరమైన వర్కవుట్స్‌ ఎలా చేస్తాడు? సో రానాకి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు లేవని తెలుస్తోంది. ఏది ఏమైనా కుప్పలు తెప్పలుగా ప్రచారంలో ఉన్న ఈ గాసిప్స్‌కి తెర పడాలంటే, రానా స్వయంగా స్పందించాల్సిందే. 

మరోవైపు రానా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రానా సినిమాలు చేస్తున్నాడు.
 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS