బిగ్ బాస్ నేను చూడలేదు: నాని

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 వచ్చే ఆదివారం నుండి ప్రసారం కానున్న నేపధ్యంలో ఈ సీజన్ కి సంబందించిన ఒక అధికారిక ప్రెస్ మీట్ ని కొద్దిసేపటి క్రితం నిర్వహించారు. ఇందులో ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా నిర్వహించనున్న నాని విలేఖరులతో ముచ్చటించారు.

ఇక వ్యాఖ్యాతగా చేయబోతుండడం ఎలా ఉంది అని ప్రశ్నించగా- దీనిని ఒక సవాలుగానే తీసుకుంటాను అని.. తప్పకుండా అందరిని మెప్పిస్తాను అని చెప్పాడు. ఇక హోస్టింగ్ విషయంలో ఎన్టీఆర్ తో పోల్చడం పట్ల స్పందిస్తూ- తాను ఇప్పటివరకు అసలు బిగ్ బాస్ షో చూడలేదు అని పైగా మొదటి సీజన్ మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటే తిట్టేవాడిని అని గుర్తుచేసుకున్నాడు.

ఈ సమయంలో, పోయిన సీజన్ మీరు అసలు చూడలేదా? అని ప్రశ్నించగా- ఇంతవరకు తాను బిగ్ బాస్ చూడలేదు అని ఒక షాక్ ఇచ్చడు. అయితే ఇప్పుడు మాత్రం తాను ప్రత్యేకంగా ఆ వీడియోలు తెప్పించుకుని  చూస్తాను అని తెలిపాడు. 

మరి ఎన్టీఆర్ స్థాయిలో ప్రేక్షకులని నాని మెప్పిస్తాడా లేదా అనేది చూడాలి.  

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS