అందాల రెజీనా ఏమైపోయిందబ్బా.!

మరిన్ని వార్తలు

హాట్‌ హాట్‌ అందాలతో తెలుగు ఆడియన్స్‌కి కిక్కెక్కించిన ముద్దుగుమ్మ రెజీనా కెరీర్‌ ప్రస్తుతం స్లోగా నడుస్తోంది. ఇటీవల నాని సమర్పణలో వచ్చిన 'అ.!' చిత్రంలో రెజీనా ఓ టిపికల్‌ రోల్‌ పోషించి, అందరి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత రెజీనాకి పెద్దగా ఆఫర్లు దక్కినట్లు లేదు తెలుగులో. ఆ మధ్య నారా రోహిత్‌తో నటించిన 'బాలకృష్ణుడు' సినిమా తప్ప హీరోయిన్‌గా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించిన దాఖలా లేదు రెజీనా ఈ మధ్య. 

బాలీవుడ్‌లో 'ఆంఖేన్‌ 2' అనే చిత్రంలో ఆఫర్‌ వచ్చిందంటూ ఆ మధ్య చాలా హడావిడి చేసింది రెజీనా. అయితే ఆ సంగతి ఏమైందో తెలీదు. సరికదా తెలుగులో చెప్పుకోదగ్గ ఆఫర్లు దక్కించుకోలేకపోతోంది. అయితే తమిళంలో రెజీనా ఓ సినిమాలో నటిస్తోంది. 'మిస్టర్‌ చంద్రమౌళి' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రెజీనాది ఓ డిఫరెంట్‌ రోల్‌ అట. అంతేకాదు, ఈ సినిమా కోసం రెజీనా విచ్చలవిడిగా ఎక్స్‌పోజింగ్‌ చేసిందంటున్నారు. అయినా ఎక్స్‌పోజింగ్‌ రెజీనాకి కొత్తేమీ కాదు. కానీ 'మిస్టర్‌ చంద్రమౌళి'లో చేసినంత ఎక్స్‌పోజింగ్‌ ఇంతవరకూ రెజీనా ఏ సినిమాలోనూ చేయలేదట. సూపర్‌ హాట్‌గా కనిపించబోతోందట రెజీనా ఈ సినిమాలో. 

ఇకపోతే, రెజీనా తెలుగు సినిమాలపై కాస్త ఎక్కువ దృష్టి పెట్టాల్సి వుందంటున్నారు ఆమె అభిమానులు. సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారట. దాంతో రెజీనా తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు తెలుపుతూ, మరిన్ని కొత్త కథలను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తోందనీ సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS