రంగస్థలంలో మైండ్ గేమ్!

By iQlikMovies - March 28, 2018 - 18:10 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రంగస్థలం సినిమా విడుదలకి ఇంకొక రెండు రోజులే మిగిలుండడంతో ఈ సినిమా కథ గురించిన రకరకాలైన వార్తలు ఇప్పుడు చక్కర్లుకోడుతున్నాయి.

తాజాగా వినపడుతున్న కథ ప్రకారం, రంగస్థలం పక్కా పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించినప్పటికీ సుకుమార్ మార్క్ మైండ్ గేమ్ ని మాత్రం వదిలిపెట్టలేదట. ప్రీ-క్లైమాక్స్ లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో సుకుమార్ తన స్టైల్ లో మైండ్ గేమ్ పెట్టాడట. అలాగే ఒక హైలైట్ డ్రామా సీక్వెన్స్ కూడా సెకండ్ హాఫ్ లో వస్తుందట, ఈ సీక్వెన్స్ లోనే ఒక మైండ్ గేమ్ ని పెట్టి కథనంలో బాగా స్పీడ్ పెంచాడట.  

పల్లెటూరి నేపధ్యంలో తీసినప్పటికీ ఆయన తన మార్క్ వదలలేదు సుక్కు అని ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.  అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో లేదో తెలియనప్పటికీ రంగస్థలం సినిమా పైన ఆసక్తి అందరికి ఉండడంతో ఈ వార్తలకి ప్రాధాన్యం దక్కుత్తున్నది.

ఏదేమైనా ఇంకొక 48 గంటల్లో ఈ చిత్రం ప్రేక్షకులకి ముందుకిరానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS