ఇటీవల విడుదలైన రామ్‌గోపాల్ వర్మ సంచలన చిత్రం 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్‌టీ)' గురించి ఈ మధ్య ఎక్కడా సౌండ్ లేదు. అదే 'జీఎస్‌టీ' సీక్వెల్ సంగతి. మొదటి పార్ట్‌ని వర్మ ఇండోర్‌లో చేశాడు. రెండో పార్ట్‌ని ఔట్‌డోర్‌లో చేస్తానని స్వయంగా వర్మ ప్రకటించాడు. అయితే ఇండోర్‌లో షూట్ చేసిన వర్మ జీఎస్‌టీ తొలి పార్ట్ నిమిత్తం ఎన్ని వివాదాలను ఎదుర్కొన్నాడో తెలిసిన సంగతే. ఏకంగా పోలీసులు, ఇన్వెస్టిగేషన్స్ దాకా చేరింది ఈ వివాదం.
ఇంతవరకూ వర్మ ఎన్ని వివాదాస్పద చిత్రాలు తెరకెక్కించినా కానీ, వాటన్నింట్లోకీ జీఎస్‌టీ వివాదం అత్యంత భారీ మూల్యమే కోరిందని చెప్పవచ్చు. మహిళా సంఘాలు ఈ సినిమాని తీవ్రంగా వ్యతిరేకించాయి. సినిమా రూపంలో వచ్చిన వివాదం కాస్తా, ఓ మహిళా సంఘ నాయకురాలి పర్సనల్ ఇష్యూ దాకా చేరింది. దాంతో వర్మ జీఎస్‌టీపై కేసుల పర్వం, అందులోంచి తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరి ఈ వివాదాస్పద పరిస్థితుల్లో 'జీఎస్‌టీ' సీక్వెల్ తెరకెక్కే అవకాశాలున్నాయా? లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయ్. మరో పక్క వర్మ 'జీఎస్‌టీ' సీక్వెల్‌ని ఆల్రెడీ షూట్ చేసి పెట్టాడనే సమాచారమ్ కూడా అందుతోంది.
ఒకవేళ ఆల్రెడీ షూట్ చేసిన సంగతి నిజమే అయితే ఆ వీడియోని వర్మ ఎప్పుడు విడుదల చేస్తాడనే అంశంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. వర్మ నోరు విప్పితే కానీ అసలు విషయం తెలీదు. ఏది ఏమైనా వివాదాలతో సింపుల్‌గా సావాసం చేసే వర్మకి 'జీఎస్‌టీ' వివాదం మాత్రం అంత తేలిగ్గా కొట్టి పారేసే వివాదం కాదని మాత్రం చెప్పాల్సిందే. ప్రస్తుతం వర్మ - నాగ్‌తో తెరకెక్కిస్తున్న 'ఆఫీసర్' సినిమా త్వరలో విడుదలకు సిద్ధమౌతోంది.