దయచేసి అలాంటి కథలు చెప్పకండి: రశ్మి

మరిన్ని వార్తలు

నటిగా-యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న రశ్మికి కెరీర్ పరంగా ఒక విషయం తలనొప్పిగా మారిందట.

అదేంటంటే- ఆమెకి వచ్చే సినిమా ఆఫర్స్ లో ఎక్కువ శాతం హారర్ చిత్రాలు ఉంటున్నాయట. ఆమె ఇప్పటికే ఒక రెండు చిత్రాలు ఇదే జోనర్ లో చేయడంతో ఎక్కువగా అదే తరహా చిత్రాల ఆఫర్స్ ఆమెకి రావడం మొదలైందట. ఇక ఆమె మాత్రం ఇప్పటికే అటువంటి చిత్రాలు చేయడంతో మళ్ళీ అవే చేయడానికి ఇష్టత చూపెట్టడం లేదు అని తెలిపింది.

ఇది తెలిసి అయినాసరే ఇకపైన హారర్ జోనర్ కాకుండా వేరే కథాంశాలతో తనని సంప్రదిస్తారు అని ఆమె కోరుకుంటుంది. మరి ఆమె విన్నపాన్ని దర్శక-నిర్మాతలు ఎంతవరకు నెరవేరుస్తారు అన్నది వేచి చూడాలి.

ఇక ప్రస్తుతం రశ్మి సినిమాలలో కన్నా టెలివిజన్ లోనే బాగా బిజీగా ఉంది. ఇప్పుడు టెలివిజన్ లో లీడింగ్ లో ఉన్న లేడీ యాంకర్స్ లో రశ్మి కూడా ఒకరు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS