మలయాళ 'ప్రేమమ్'తోనే సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనిపించింది బ్యూటీ సాయి పల్లవి. ఇక తెలుగులో తొలి సినిమా 'ఫిదా'తో అందర్నీ ఫిదా చేసింది. తొలి సినిమాకే తెలుగులో అది కూడా తెలంగాణా యాసలో మాట్లాడి అందర్నీ తన వైపుకు తిప్పేసుకుంది. ఈ వర్గం ఆ వర్గం అనే తేడా లేకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులు సాయి పల్లవి జపం చేసేలా చేసింది. రెండో సినిమాకీ అంతే. నానితో 'ఎంసీఏ'లో నటించి మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది.
ఓ పక్క టాలీవుడ్‌లో టాలెంట్‌కి విలువ లేదు. కాస్టింగ్ కౌచ్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అంటూ పలువురు నటీమణులు వివాదాలు తెస్తున్న ఈ తరుణంలో సాయి పల్లవి అందుకు వ్యతిరేకంగా టాలెంట్ ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఏదైనా అధిగమించొచ్చు. టాలెంట్‌కి అందం కూడా అతీతం కాదని నిరూపించేస్తోంది. హీరోయిన్ అంటే అందంగా ఉండాలి. అలాంటిది ముఖం నిండా మొటిమలతో హీరోయిన్‌గా అస్సలు ఇష్టపడని నేచురల్ గ్లామర్‌తో సాయి పల్లవి నెట్టుకొచ్చేస్తోంది. నెట్టుకు రావడం కాదు, నెగ్గుకొస్తోంది. మరి దీన్నేమనాలి.
తెలుగు తన మాతృభాష కాకపోయినా, తెలుగులోనే చక్కగా మాట్లాడుతూ, డబ్బింగ్ అవసరం లేకుండా, సొంత గొంతుతోనే ఆకట్టుకుంటోంది. కొందరు తెలుగు భామలైనా కానీ, తెలుగులో మాట్లాడేందుకు ఇష్టపడరు. అలాంటిది తెలుగు తన మాతృభాష కాకపోయినా, కానీ తెలుగు తనకి చాలా కంఫర్ట్ అంటోంది సాయి పల్లవి. అందుకే సాయి పల్లవి తెగ నచ్చేస్తోంది.
త్వరలోనే 'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. మరో పక్క శర్వానంద్‌తో 'పడి పడి లేచె' మనసులోనూ సాయి పల్లవి నటిస్తోంది.