నిన్న రాత్రి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి చెందిన ప్రముఖ హీరోల భేటీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
అయితే ఈ భేటికి ప్రముఖ హీరోలందరూ హాజరవ్వడం అలాగే మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఈ మీటింగ్ జరగడం అందులోనూ నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇది జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇక ఈ భేటి గురించి చివరి నిమిషం వరకు మీడియాకి కాని బయట వ్యక్తులకి కాని తెలియకపోవడం ఈ భేటిని మరింత ప్రత్యేకంగా మార్చింది. ఈ మీటింగ్ గురించి బయట వ్యక్తమవుతున్న అభిప్రాయాల ప్రకారం- ఇది ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న పరిస్థితులు అలాగే భవిష్యత్తులో మీడియాతో ఎలా వ్యవహరించాలి అన్నదాని పైన వీరంతా చర్చించి ఉండవచ్చు.
మొత్తానికి హీరోలందరూ ఒకేతాటి పైకి వచ్చి ఇలా తమ తమ అభిప్రాయాలని వ్యక్తపరచడం నిజంగా శుభ పరిణామమే..