శ్రీరెడ్డి చెప్పేదంతా నిజమేనా?

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో పలువురు ప్రముఖులపై లైంగిక ఆరోపణలు చేయడంతో లైమ్‌ లైట్‌లోకి వచ్చిన శ్రీరెడ్డి, తర్వాత తెలుగమ్మాయిలకే అవకాశాలు ఇవ్వాలనే పోరాటంతో రోడ్డెక్కింది. అర్ధ నగ్న ప్రదర్శన చేసింది. ఆ తర్వాత ప్రముఖులపై అనవససర నోటి దురుసుతనంతో అర్దం పర్దం లేని అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె పోరాటం కాస్త పక్కదారి పట్టి, కొన్ని రోజులు కామ్‌ అప్‌ అయిపోయింది. 

తాజాగా మళ్లీ సోషల్‌ మీడియాలో శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. సినీ రంగంలో ఇంతవరకూ అమ్మాయిల పైనే లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న ఆమె ఆరోపణలు రూటు మార్చాయి. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కొంతమంది పెద్ద దర్శకులు తమ కింద పనిచేసే అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ని ఇతరత్రా క్రింది డిపార్ట్‌మెంట్‌ అబ్బాయిల్ని లైంగికంగా వాడుకుంటున్నారనీ శ్రీరెడ్డి ఆరోపించింది. 

దాంతో శ్రీరెడ్డి మళ్లీ హాట్‌ టాపిక్‌లోకి వచ్చింది. కేవలం పబ్లిసిటీ కోసమే శ్రీరెడ్డి ఇదంతా చేస్తుందని మొదట్లో అంతా లైట్‌ తీసుకున్నారు. కానీ పోరాటం పేరుతో శ్రీరెడ్డి ఆరాటం ఏదో ఒక రకంగా కొనసాగిస్తూనే ఉంది. ఆమె చేసిన ఆరోపణలు చాలా వరకూ నమ్మేలా అనిపించడం లేదు. అయితే మగాళ్లపై లైంగిక వేధింపులు అంటూ బాలీవుడ్‌ నటి రాధికా ఆప్టే కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ఆమె వ్యాఖ్యలు గుర్తుకు తెచ్చుకుంటే, శ్రీరెడ్డి ఆరోపణలపై ఆలోచించాల్సిన అవసరం ఏర్పడుతోంది. నిన్న మొన్నటిదాకా జరిగిన ఇష్యూస్‌ కారణంగా శ్రీరెడ్డి సాధించింది ఏమీ లేకపోయినా, తాజాగా రైజ్‌ చేసిన ఈ ఇష్యూతో శ్రీరెడ్డి ఇంకేం సాధిస్తుందో చూడాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS