నటి శ్రీ రెడ్డి ఇన్ని రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలకి బలాన్ని చేకూరుస్తు నిన్న రాత్రి కొన్ని ఫోటోలు విడుదల చేయడంతో ఇప్పుడు అందరి దృష్టి అమెవైపుకి మళ్ళింది.
ఆమె త్వరలోనే మరిన్ని ఆధారాలతో కూడిన వివరాలని బయటపెడతాను అని తేల్చి చెప్పింది. అలా చెప్పిందో లేదో కాని కొన్ని వెబ్ సైట్స్ లో ఆమెతో చాట్ చేసిన ప్రముఖులు అంటూ ఒక దర్శకుడు, ఒక రచయతల చాట్స్ స్క్రీన్ షాట్స్ ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇన్నిరోజులుగా ఆమె తన వద్ద ఉన్న ఆధారాలని లీక్ చేస్తాను అని చెబుతూ వచ్చింది. అయితే ఆమె కేవలం మాటలే చెబుతుంది తప్ప ఎటువంటి ఆధారాలు లేవు అని కొందరు వ్యాఖ్యానిస్తున్న తరుణంలో ఆమె ఇచ్చిన ఈ లీక్స్ తో అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
ఇక ఇప్పుడు ఆమె లిస్టులో తరువాత ఎవరు ఉన్నారు అన్న చర్చ మొదలైంది.