నిన్న రాత్రి శ్రీ రెడ్డి ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలని విడుదల చేయడంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా అభిరామ్-శ్రీరెడ్డి ఫోటోలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి. ఇక వీటి పైన సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు స్పందించాలి అని శ్రీ రెడ్డి డిమాండ్ చేస్తున్నది. ఇదే సమయంలో ఈ ఫోటోల పైన దగ్గుబాటి కుటుంబం నుండి కూడా ఎవరో ఒకరు స్పందిస్తే బాగుంటుంది అని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
మరి సురేష్ బాబు కాని హీరో రానా కాని ఈ అంశం పైన స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి. అలాగే శ్రీ రెడ్డి మరికొంతమంది నిర్మాతలు కూడా ఇలా తనని అవకాశం ఇస్తాను అని చెప్పి మోసం చేశారు అని చెప్పడం ఇప్పుడు అందరిని అలెర్ట్ అయ్యేలా చేసింది. ఎందుకంటే, ఇప్పుడు ఆమె ఎవరి వివరాలు బయటపెట్టనుంది అన్నది తెలియాల్సి ఉంది.
ఏదేమైనా.. శ్రీ రెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది.