అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. మామయ్య నాగార్జునతో కలిసి నటించిన 'స్నేహమంటే ఇదేరా' సినిమా మంచి విజయం అందుకుంది. కానీ ఈ మధ్య సుమంత్ కెరీర్ చాలా స్లో అయిపోయింది. సుమంత్‌ని అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ మూవీ 'విక్కీ డోనర్'ని తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో రీమేక్ చేసి హీరోగా మళ్లీ తన ఉనికిని చాటుకోవాలనుకున్నాడు. కానీ నిరాశ పరిచాడు. దాంతో మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకుని మన ముందుకు రాబోతున్నాడు. ఈ సారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుమంత్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ ఓ సినిమా చేయబోతున్నాడు. రాహుల్ యాదవ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆకాంక్ష సింఘ్ హీరోయిన్:గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. స్టోరీ చాలా కొత్తగా ఉంటుందట. ఈ సినిమాతో ఖచ్చితంగా విజయం అందుకుంటానని పూర్తి నమ్మకంతో ఉన్నాడు సుమంత్. ఈ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట. వీలైనంత త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనుందట చిత్ర యూనిట్. సినిమా స్టోరీ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే కానీ, సినిమాలో సుమంత్ క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందంటున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.