యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ హీరోగా వస్తోన్న సినిమా 'అంధగాడు'. ఇదో ప్రయోగాత్మక చిత్రం. ఈ సినిమాలో రాజ్ తరుణ్ అంధగాడి పాత్రలో కనిపిస్తాడు. తొలి నలభై నిముషాలు అంధగాడి పాత్రలో రాజ్ తరుణ్ పండించే వినోదం ఆధ్యంతం ప్రేక్షకుల్ని చక్కిలి గింతలు పెట్టించేలా ఉంటుందట. హెబ్బా పటేల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ముచ్చటగా మూడోసారి హెబ్బా, రాజ్‌తరుణ్ జంట స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందెన్నడూ రాజ్ తరుణ్ సినిమాలకు చేయనంత పబ్లిసిటీ ఈ సినిమాకి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాని దర్శక రత్న దాసరికి అంకితమిచ్చేశారు. ప్రోమోస్ ద్వారా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. డైరెక్షన్ ఫీల్డ్ నుండి అనుకోకుండా హీరోగా అవతారమెత్తిన రాజ్‌తరుణ్ సో బిజీ. ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోల లేటెస్ట్ సినిమాల్లో రాజ్ తరుణ్ పలు చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం హీరోగానే కాదండోయ్ డిఫరెంట్ క్యారెక్టర్స్‌లోనూ నటించాలన్న తన కోరికను రాజ్ తరుణ్ బయట పెట్టాడు. అలాగే మల్టీస్టారర్ మూవీస్‌లో నటించడానికీ రాజ్‌తరుణ్ సిద్ధంగా ఉన్నాడట. ప్రస్తుతం ఈయన చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం రంజిని డైరెక్షన్‌లో ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు. సంజన రెడ్డి డైరెక్షన్‌లో 'రాజుగాడు యమ డేంజర్' అనే సినిమాతో మరో ప్రయోగం చేయనున్నాడు మనోడు. అలాగే దిల్ రాజుతో ఓ సినిమా చేయనున్నాడట.