ఓ సినిమాకి కమిట్ అయి, ఆ సినిమాలో మీరు సరిగ్గా కన్పించడంలేదని తెలిసి, ఇన్నేళ్ళు ఎలా ఆ సస్పెన్స్‌ని, బాధని భరించారు? అనే ప్రశ్న 'దేవసేన' అనుష్క ముందుంచితే, సమాధానమివ్వడానికి ఆమె కొంత తటపటాయించింది. 'బాహుబలి ది బిగినింగ్' ఎన్నో అంచనాల నడుమ విడుదలయ్యింది. ఆ అంచనాలకు ఓ కారణం అనుష్క కూడా. ఆమెకు అప్పట్లో ఉన్న స్టార్‌డమ్ అలాంటిది. అయితే అనుష్కకి ఆ సినిమాలో పెద్ద పాత్ర దక్కలేదు. తమన్నానే ఎక్కువ ఫోకస్ అయ్యింది. దాంతో అనుష్క అభిమానులు డీలాపడ్డారు కూడా. మళ్ళీ ఇప్పుడు ఆమె అభిమానులు 'బాహుబలి ది కంక్లూజన్' గురించి ఎదురుచూస్తున్నారు. మొదటి పార్ట్‌లో గ్లామర్ యాంగిల్ లేకపోయినా, రెండో సినిమాలో గ్లామర్ యాంగిల్ ఉంటుందట. గ్లామర్ అంటే వల్గారిటీ అని కాదు, మొదటి పార్ట్‌లోలా ముసలి పాత్ర కాకుండా యంగ్ పాత్ర అన్నమాట. అంతే కాదు, 'కంక్లూజన్' కోసం అనుష్క చాలా పోరాటాలు చేసింది. 'బాహుబలి' కోసం అనుష్క ఎంత కష్టపడిందీ ఆ సినిమా టీమ్ అంతటికీ తెలుసు. అయితే రెండో పార్ట్‌లో చాలా అంశాలను రాజమౌళి చూపించాల్సి ఉంది. అందులో అనుష్క ఫ్యాక్టర్ ఒకటి. అలాగే ప్రభాస్ - రాణా మధ్య యుద్ధం, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అన్నిటి నడుమ అనుష్క పాత్ర ఆశించినమేర ఉంటుందా? అనే సస్పెన్స్ అయితే లేకపోలేదు. ఇవన్నీ ఇలా ఉంటే, రాజమౌళి చెప్పగానే ఇంకేమీ ఆలోచించకుండా ఒప్పుకున్నాననీ, సినిమా చేయడంలో ఏళ్ళు గడిచిపోయాయని చెబుతూ నా పాత్ర ఏంటో, అదెలా ఉంటుందో తెరపై చూస్తేనే బాగుంటుందని సస్పెన్స్ కొనసాగించింది అనుష్క.