బాహుబలి 2 క్రేజ్ ప్రపంచమంతా పాకేసింది. ఏప్రిల్ 28 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రబృందం కూడా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. ఇటీవలే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేసింది. బాహుబలి 1 సమయంలో చిత్రబృందం ప్రమోషన్ల కోసం పైసా పెట్టలేదు. పేపర్లకు, టీవీలకు యాడ్లు కూడా ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం.. ప్రమోషన్లు చేయాలని, మీడియాకు యాడ్లు ఇవ్వాలని నిర్మాతలు భావిస్తున్నార్ట. మరోవైపు ముంబైలోనూ ప్రమోషన్లు భారీ ఎత్తున చేయాలని ఆర్కా మీడియా ఫిక్సయ్యింది. బాహుబలి 1 బాలీవుడ్లో రూ.100 కోట్లు సాధించింది. బాహుబలి 2 దాదాపుగా రూ.200 కోట్లు సాధిస్తుందన్న అంచనాలున్నాయి. అందుకే.. ప్రమోషన్ల కోసం ఎంత ఖర్చు పెట్టినా తప్పులేదని, యాడ్లు ఈసారి విరివిగా ఇవ్వాలని ఆర్కా మీడియా భావిస్తోందట.