ప్రయోగాత్మక చిత్రంగా మొదలై... కమర్షియల్ హిట్ అయిన సినిమాలు చాలా తక్కువ. ప్రయోగాలు చేస్తే అవార్డులు తప్ప.. డబ్బులు రావనుకొంటారు. అయితే... ఆ విమర్శని తిప్పి కొట్టింది ఘాజీ. రానా కథానాయకుడిగా సంకల్ప్ దర్శకత్వంలో రూపొందిన ఘాజీ విమర్శకుల్ని మెప్పించింది. బాక్సాఫీసు దగ్గర భారీ లాభాల్నీ దక్కించుకొంది. రూ.20 కోట్లతో తెరకెక్కిన సినిమా ఇది. బాక్సాఫీసు వసూళ్లు, శాటిలైట్ మార్కెట్ కలుపుకొంటే దాదాపుగా రూ.50 కోట్లు దక్కించుకొంది చిత్రబృందం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేయడం ప్లస్ పాయింట్ గా మారింది. మూడు చోట్లా డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకొన్న ఈ సినిమా, శాటిలైట్ రూపంలో మంచి రేటు రాబట్టుకోవడంతో... నిర్మాతలు భారీ లాభాల్ని సాధించారు.