త్వరలో రానున్న పండగ తెలుగు సంవత్సరాది. పండగలకు బుల్లితెరపై సినిమాల సందడి కూడా ఉంటుంది. ఈ సందడి పండక్కి మరింత వెలుగు తెస్తుంది. ఇంటిల్లిపాదీ చక్కగా పిండివంటలు వండుకుని టీవీల ముందు కూర్చొని పండగతో పాటు సినిమాలనీ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సారి ఉగాదికి బుల్లితెరపై పెద్ద ఫైటే జరగనుంది. బాక్సాఫీసు ఫైట్‌ని పోలినట్టుగా ఈ ఫైట్ ఉండనుంది. ఎందుకంటే మూడు సూపర్ హిట్ సినిమాలు ఈ ఉగాదికి బుల్లితెరపై సందడి చేయనున్నాయి. అవే 'గౌతమీ పుత్ర శాతకర్ణి', 'శతమానం భవతి', 'జెంటిల్‌మెన్' సినిమాలు. వీటిలో 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా ఈ సంక్రాంతికి విడుదలై, సంచలనాలు సృష్టించింది. బాలయ్య వందో చిత్రంగా కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. అలాగే 'శతమానం భవతి' సినిమా కూడా యంగ్ హీరో శర్వానంద్‌కి మంచి గుర్తింపు తెచ్చింది. కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్‌ని తెచ్చి పెట్టింది. ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీగా వచ్చి, నిలబడిని సినిమా ఇది. ఇక మూడో సినిమా నాని హీరోగా వచ్చిన 'జెంటిల్‌మెన్'. నాని కెరీర్‌లో డిఫరెంట్ మూవీ ఇది. గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేక్షకుల మెప్పు పొందిన చిత్రమిది. ఇలాంటి మూడు విభిన్న సినిమాలు ఈ ఉగాదికి బుల్లితెరపై ప్రేక్షకుల ముందుకు వస్తోంటే నిజమైన ఉగాది ఇదే అనిపించట్లేదు. మరి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువగా బ్రహ్మరధం పడతారో. ఏ సినిమకి టిఆర్‌పి రేటింగ్ ఎక్కువ వస్తుందో చూడాలిక.