ఇంతకు ముందు వరకూ నానితో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అని బలంగా నమ్మేవారు. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడలా కాదు, నానితో సినిమా చేస్తే అది మినిమమ్ గ్యారంటీ కాదు, గ్యారంటీగా హిట్టయ్యే సినిమా అన్న భావన ఇండస్ట్రీలో బలపడిపోయింది. ఓ సాధారణ సినిమాతోనూ భారీ వసూళ్ళు సాధించడం నానికి అలవాటైపోయింది. 'భలే భలే మగాడివోయ్' సినిమా నుండీ నాని ఇదే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. నాని సినిమా వచ్చిందంటే అది హిట్టా, ఫట్టా అనే ఆలోచనే లేదు. గ్యారంటీగా హిట్టే. అదీ నాని స్ట్రాటజీ. ఈ నేచురల్ స్టార్ పట్టిందల్లా బంగారమే అవుతోందిప్పుడు. 'మామూలు సినిమా' అని రేటింగ్స్ దక్కించుకుంటున్నప్పటికీ ఆ సినిమాలు సంచలన వసూళ్ళను సాధిస్తున్నాయి. 'నిన్నుకోరి' సినిమా కూడా అంతే. ఎమోషనల్ డ్రామా కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవారికి కష్టమనే అభిప్రాయాలు తొలిరోజు వినవచ్చాయి. కానీ నాని ప్రభంజనాన్ని ఆ టాక్ అడ్డుకోలేకపోయింది. ఏ టాక్ వచ్చినా నాని సినిమా వసూళ్ళయితే అదరగొట్టేస్తున్నాయ్. అందుకే నాని ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీయెస్ట్ యంగ్ హీరో. అంతేకాదు నానికి ఓవర్సీస్ మార్కెట్ చాలా బలంగా ఉంది. అక్కడ నాని సినిమాలకు తిరుగే లేదు. వసూళ్ల విషయంలోనూ డాలర్ల పంట పండుతోంది అక్కడ. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి సృష్టిస్తోన్న ప్రభంజనాలివి. నివేదా థామస్, ఆది పినిశెట్టి ఇతర ప్రధాన తారగణంగా నటించారు ఈ సినిమాలో.