'రోగ్' సినిమా గురించి పూరి చాలా చాలా గొప్పగా చెబుతున్నాడు. ఏ దర్శకుడైనా తన కొత్త సినిమా గురించి ఇలాగే చెప్పాలి. అయితే పూరి లాంటి స్టార్ డైరెక్టర్ ఇంత గొప్పగా చెప్పడమంటే సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంతవరకూ పూరీ చాలా లవ్ స్టోరీలు తెరకెక్కించారు. వాటన్నింటిలోకెల్లా, నా జోనర్ నుంచి బయటకు వచ్చిన పూర్తిస్థాయి ఔట్ అండ్ ఔట్ సూపర్బ్ లవ్ స్టోరీ ఈ సినిమా అని పూరీ చెప్పడం విశేషం. ఇంతవరకూ తాను తెరకెక్కించిన లవ్ స్టోరీస్ అన్నింట్లోనూ బెస్ట్ లవ్ స్టోరీ సినిమా ఇదేనని పూరి చెప్పడం గమనించదగ్గది. సినిమా నిండా యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయేమో అనేలా 'రోగ్' ప్రోమో కనిపిస్తోంది. పూరి రెగ్యులర్ మూవీస్‌కి భిన్నంగా అనిపించడంలేదది. పూరీ సినిమాలన్నింట్లోనూ ఉండే కామన్ యాక్షన్ ఎపిసోడ్స్‌లానే ఉన్నాయి. కానీ పూరి డిఫరెంట్ అంటున్నాడు. అంటే ఏదో సస్పెన్స్ ఉందన్నమాట. థియేటర్లకు ఆడియన్స్‌ని ఈ తరహా ప్రోమోస్‌తో రప్పించి, లోపల ఆడియన్స్‌ని థ్రిల్‌కి గురయ్యేలా చేస్తాడేమో. పూరి తక్కువోడేమీ కాదు. అలాగే ఏదో చేసే ఉంటాడనిపిస్తోంది ఈ సినిమాలో. అందుకే పూరీ ఈ సినిమా పట్ల ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ప్రమోషన్ కూడా బాగా చేస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాలో ఏం మ్యాజిక్ చేశాడో థియేటర్లలోకి వెళితేనే తెలుస్తుందట. సో సినిమా రిలీజ్ వరకూ ఈ సస్పెన్స్‌ని ఫీలవ్వాల్సిందే తప్పదు.