రాజమౌళి ఈ పేరుకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లాడి దగ్గర్నుంచీ, ముసలాడి దాకా రాజమౌళి పేరు తెలియని వారుండరు. అంతగా పాపులర్ అయిపోయింది ఈ పేరు. నిజానికి రాజమౌళి తెరపై కనిపించేదే ఉండదు. కానీ ఆయనకు వ్యక్తిగానే ఇంత ఆదరణ దక్కుతోందంటే ఇదంతా 'బాహుబలి' సినిమా పుణ్యమే. కేవలం టాలీవుడ్‌లోనే కాదు, ఆయనకి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన ఆదరణ దక్కేలా చేసింది ఈ సినిమా. ఓ డైరెక్టర్‌గా ఇంత గొప్ప స్టార్‌డమ్ సంపాదించుకున్న రాజమౌళికి చాలా ప్రత్యేకతలున్నాయి. అందులో ముఖ్యమైనది పొగడ్తలకు పొంగిపోకపోవడమే. ఇంత స్టార్‌డమ్ మరే ఇతర డైరెక్టర్‌కి దక్కినా ఆ లెవల్ వేరే ఉంటుంది. కానీ రాజమౌళి అలా కాదు. చాలా సింపుల్‌గా ఉంటాడు. పొగడ్తలకు పొంగిపోకపోవడమే కాదు, ఆయనకి పొగడటం కూడా రాదంటున్నాడు. ఇదే విషయాన్ని ఆయన భార్య రమా రాజమౌళి కూడా స్పష్టం చేసింది. ఎప్పుడూ ఒకేలా ఉండే రాజమౌళికి సక్సెస్, ఫెయిల్యూర్ అనే వాటిపై అస్సలు నమ్మకం లేదంటున్నాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో మంచి సినిమాలు తీశారు. వాటన్నింట్లోకీ 'బాహుబలి' సినిమా న భూతో న భవిష్యతి. అందుకే ఈ సినిమాకి దేశ దేశాల ఇంత ఆదరణ దక్కుతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా ఖ్యాతికెక్కింది. ఏది ఏమైనా మీ వ్యక్తిత్వానికి హ్యాట్సాప్ రాజమౌళి!