మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం రంగస్థలం 1985 సంబంధించి రోజుకొక ఆసక్తికర విషయం బయటకివస్తున్నది.
అందుతున్న సమాచారం ప్రకారం, రంగస్థలం చిత్రం శాటిలైట్ రైట్స్ కోసం ప్రముఖ ఛానల్స్ తీవ్రంగా పోటిపడుతున్నాయి. అందులో స్టార్ మా ఛానల్ సుమారుగా రూ16 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం.
ఇదే మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ గనుక అమ్ముడవుతే, ఇదొక కొత్త రికార్డుగా నిలిచిపోనుంది. బాహుబలి రెండు భాగాలకి కలిపి రూ 24కోట్లకు అమ్ముడవగా, ఇప్పుడు ఒక చిత్రానికే ఇంత మొత్తం రావడం నిజంగా రికార్డే.
ఈ ప్రాజెక్ట్ కి ఇంత ధర రావడానికి కారణం సుక్కు-చరణ్ ల కాంబినేషన్ అని వేరే చెప్పకర్లేదుగా..