బాలీవుడ్ భామ దీపికా పడుకొనే, దక్షిణాదిలో ఉపేంద్ర సరసన ఓ సినిమాలో నటించింది. చాలాకాలం క్రిందట జరిగింది అది. తమిళంలో రజనీకాంత్ సరసన దీపిక ఒక సినిమాలో చేసినా అది గ్రాఫిక్స్ సినిమా. అదే 'కొచాడియాన్'. అందులో మోషన్ క్యాప్చర్ విధానంతో చిత్రీకరణ జరపడంతో తెరపై ఆయా నటీనటుల్ని పోలిన పాత్రలు మాత్రమే కనిపించాయి. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్‌తో ఆన్ స్క్రీన్ పెయిర్‌గా అలరించబోతోందట ముద్దుగుమ్మ దీపికా పదుకొనె. రజనీకాంత్‌తో దీపికా పడుకొనే నటించేందుకు రంగం సిద్ధమయ్యిందని తాజా సమాచారమ్. 'కబాలి' ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించే సినిమా కోసం దీపికా పడుకొనేతో సంప్రదింపులు జరుగుతున్నాయట. రజనీకాంత్‌తో సినిమా అనగానే దీపికా పడుకొనే కూడా సానుకూలంగానే స్పందించిందని తెలియవస్తోంది. గతంలో దీపికా పదుకొనె 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్' సినిమాలో లుంగి డాన్స్ పాటలో తలైవా.. అంటూ డాన్సులేసింది. అలా ఆయనంటే దీపికాకి ఎంతో అభిమానమట. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. తాజాగా సౌత్‌లో కూడా కాలు మోపడం అభినందించదగ్గ విషయమే. పా రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా 'కబాలి' నిరాశ పరచడంతో ఈ సారి ప్లాన్డ్‌గా తాజా చిత్రాన్ని రూపొందిస్తున్నారట.