ఇండియాలో ది బెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం కెరీర్ గ్రాఫ్ ఈ మధ్య తగ్గిందనే చెప్పాలి. అయితే తన ఆఖరి చిత్రం ఓకే బంగారం తో ఒకే అనిపించుకున్నా తన రేంజ్ హిట్ మాత్రం అవ్వలేదు.
ఇక ఇందుకోసం తన కొత్త చిత్రం చెలియాని సిద్దం చేశాడు. ఈ చిత్రం, ఏప్రిల్ 7వ తారీఖుని రిలీజ్ చేయడానికి ముహూర్తంగా ఫిక్స్ చేశారట. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది, రెహమాన్ తన మార్క్ మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేశాడు.
చూద్దాం.. మరి చెలియా చిత్రం మణిరత్నం హిట్స్ లిస్ట్ లో చేరబోతుందో లేదో!