మేడమ్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ సుమీ

మరిన్ని వార్తలు

రమా రాజమౌళి అంటే కూల్‌గా సాఫ్ట్‌గా ఉంటారనుకునేవారికి ఆమె ఇంటర్వ్యూలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. రాజమౌళి సతీమణిగానే కాకుండా, ఆయన తెరకెక్కించే సినిమాల్లో కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా రమా రాజమౌళి తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. అయితే చాలా అరుదుగా మాత్రమే ఆమె మీడియా ముందుకు వస్తారు. వచ్చినా, ఇప్పటివరకూ కేవలం సీనిమాల గురించే మాట్లాడేవారు. కానీ 'బాహుబలి ది కంక్లూజన్‌' సందర్భంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న గాసిప్స్‌ని ఘాటుగా ఖండిస్తున్నారు. ఇంకో వైపున, సినిమాపై పెత్తనం చేస్తున్నారన్న విమర్శలపై మండిపడుతూ, కడిగి పారేయడం జరుగుతోంది. 'బాహుబలి' అనుకున్నదానికన్నా చాలా ఆలస్యమయ్యింది కదా? అన్న ప్రశ్నకు రమా రాజమౌళి చెప్పిన సమాధానం సూపర్బ్‌గా ఉంది. ఇప్పుడీ ఆన్సర్‌ టాలీవుడ్‌లో డిస్కషన్‌ పాయింట్‌ అయ్యింది. 'బాహుబలి' సినిమా కోసం మేం కష్టపడి పనిచేశాం, పనిలో ఉన్నప్పుడు కష్టం గురించీ తెలియలేదు, సమయమూ తెలియలేదు. అలా రోజులు గడిచిపోయాయి. ఫస్ట్‌ పార్ట్‌ వచ్చాక మా కష్టానికి తగిన గుర్తింపు లభించింది. ఆ కష్టమేంటో మాకు తెలుసు. తొందరగా చేసేయ్యొచ్చన్న అభిప్రాయం కొందరికి ఉండొచ్చు, వారి అభిప్రాయం వారిదేనని రమా రాజమౌళి అన్నారు. 'నేను చెప్పేది నేను చెప్తాను, ఇంకొకరి అభిప్రాయాల్ని ఖండించాల్సిన అవసరం లేదు' అనే మాట చెప్పడానికి చాలా కాన్ఫిడెన్స్‌ కావాలి. అంత స్ట్రాంగ్‌ మైండెడ్‌ కాబట్టే, చేస్తున్న పనిలో అంత ప్రత్యేకతను చాటుకుంటున్నారు రమా రాజమౌళి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS