రోబో 2 శాటిలైట్ రైట్స్ ఇప్పుడు భారతీయ సినీ ప్రపంచంలోనే ఓ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు ఏకంగా రూ.110 కోట్లకు అమ్ముడుపోయాయన్న వార్త బాలీవుడ్‌ని సైతం నివ్వెర పరుస్తోంది. ఎందుకంటే అక్కడ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్లకే ఈ స్థాయి రేటు దక్కడం లేదు. రజనీకాంత్ స్టామినా, శంకర్ టాలెంట్‌పై నమ్మకంతోనే ఈ స్థాయి రేటుకి జీ టీవీ సొంతం చేసుకొందని మార్కెట్ వర్గాలు చెబుతున్నా, మరీ 110 కోట్లంటేనే నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే తెలుగులో రజనీ సినిమా శాటిలైట్ ఎప్పుడూ రూ.10 కోట్లు దాటలేదు. బాలీవుడ్‌లో ఈ సినిమాని రూ.50, రూ.60 కోట్లు పెట్టి కొనే సీన్‌లేదు. కేవలం ఈసినిమా హైప్ పెంచడానికే ఈ అంకెల గారడీ చేస్తున్నారా?? అంటూ ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. టీవీ ఛానళ్లకు ఎంత రేటింగులు వచ్చినా, కేవలం యాడ్ల మీదే... రూ.110 కోట్లు సంపాదించడం సాధ్యం కాదు. మరి ఏ లెక్కతో రూ.110 కోట్లు వెచ్చించారన్నది జీ టీవీకే తెలియాలి.