నటీ నటులు సినిమా సినిమాకీ నటనలోని డిఫరెంట్ యాంగిల్స్‌ని బయటికి తీస్తూనే, తమ తమ నటనలోని తప్పుఒప్పులను కూడా సరిదిద్దుకుంటూ ఉండాలి. అదే చేస్తున్నాడు ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఈ హీరో తాజా చిత్రం 'విన్నర్'. ఈ సినిమాలో తేజు డైలాగ్ డెలివరీలో చాలా ఛేంజ్ చేశాడట. మామూలుగా తేజు డైలాగ్ చెప్పే విధానం చాలా స్పీడుగా ఉంటుంది. అయితే ఈ సినిమాకి ఆ వేగం కొంచెం తగ్గించాడట. అంతేకాదు ఈ సినిమా కోసం గుర్రాల్ని మచ్చిక చేసుకోవడం ఎలాగో నేర్చుకున్నాడట. ఎందుకంటే ఈ సినిమా కథ అంతా గుర్రాల రేస్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఓ గుర్రాన్ని తేజు మచ్చిక చేసుకున్నాడట. గత చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రంలో తేజు లుక్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక తేజు డాన్సుల గురించి చెప్పనే అక్కర్లేదు. ఈ సినిమా కోసం కొత్త కొత్త స్టెప్పులు ట్రై చేశాడట తేజు. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఇంకా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. హాటీ యాంకర్ అనసూయ ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తుండగా, బ్యూటీ యాంకర్ సుమ ఆ పాటను ఆలపించడం విశేషం. మార్చిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.