అయ్యబాబోయ్‌ సుచిత్ర పేల్చేస్తోంది

మరిన్ని వార్తలు

తెలుగు, తమిళ సినీ రంగాల్లో ఇప్పుడు అందరూ సుచిత్ర గురించే చర్చించుకుంటున్నారు. సుచిత్ర అనే సింగర్‌, తన గాత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది. పలు సినిమాల్లో ఆమె పాటలకు మంచి పేరు సంపాదించుకుంది. తన గాత్రానికే పాపులారిటీ కానీ, ఆమె ఎవరో చాలా మందికి తెలీదు ఇంతవరకూ. అలాంటిది ఇప్పుడామె వార్తల్లోకెక్కడానికి కారణం ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌. ఇందులో కొన్ని ఫొటోలు సంచలనంగా మారుతున్నాయి. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలకు చెందిన కొందరు నటీనటుల ప్రైవేట్‌ ఫొటోలు ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌లో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో కొన్ని అసభ్యకరంగా ఉన్నాయి. అయితే ఇలాంటివి ట్విట్టర్‌లో చాలా సహజమైపోయాయి. అయితే ఈ విషయంలో ఈమె కొంచెం ఘాటుగా ఫీలయ్యింది. ఈ విషయంలో తనకు సంబంధం లేదనీ అంటోంది. తన ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎవరో హ్యాక్‌ చేశారనీ అంటోంది. అందులో చాలావరకూ మార్ఫింగ్‌ ఫొటోలుగా అనుమానిస్తున్నారు. అంతేకాక తనను వేధింపులకు గురిచేశారంటూ ఈ మధ్యనే ఆమె ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ధనుష్‌పై పలు రకాల ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆమె భర్త కార్తీక్‌ ఖండించాడు. ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయ్యిందన్నాడు. కానీ తాజా వ్యవహారంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయమై సదరు నటీనటులు ఆందోళన చెందుతున్నారు. 

 

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS